పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                 నోము
     (వాయుసందేశమునుండి)

పూతకృష్ణానదీజలస్నాత యౌచు
సగము తడియారుచున్నవస్త్రమ్ము దాల్చి
శ్రమ మటంచు భావింపకే సంతసమున.
గిరిశిఖర మెక్క్జి రామలింగేశ్వరునకు
రంగమై వాసగృహము జేరంగబోవు
చేరి, పూజాగృహమ్మున గౌరీదేవి
పనుపు విగ్రహమునువేదికపై నమర్చి
పూల కుంకుమాక్షతలను బూజ చేసి
వానిలో కొంచెము శిరస్సుపైన దాల్చి,
మాతకుబ్రణామ మోంరించి మహితభక్తి
దేవి కారగింపుగ నిడ్డ తీయజామ
పండు గైకొని ప్రేమమ్మునిండుమదిని
తేనె లొలుక "అక్కా" యని దీనముగను
పంజరమునుండి పిలిచెడు పంచెవన్నె
రామచిల్కకు దినిపించి, 'శ్యామనిభుడు