పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిఆతివతో తిన్నగా సౌఖ మనుభవింప
లేదు లోక మోహనమగు లేమసొగసు
మఱపు రాకుండ తిరముగా మదిని నాట
హృదాఫలకమ్ముపైన చిత్రింపలేదు !
ఇంతలోనె నా మురిపెపు టింతితోడ
నేల నీ యెడబాటు జపించెసఖుడ !

చెవులపండువుఇ సేసెడి చెలియవలపు
పలుకుదేనెల తమి గ్రోలి పరవసమ్ము
జెందలేదింతలోనెనా చెలికి నాకు
నేల నీయెడబాటు జనించెసఖుడ !

నాతి నెయ్యంపుచిన్నెగానాటినట్తి
వలపుతీగెలేజివుళ్ళు; మొలచి పూలు
పూయలే దింతలోనె నాపొలతితోడ
నేల నీయెడబాటు జనించె సఖుడ!

కలలోనైనను నెడబాటు గలుగునంచు
నించుకైనను మదిలోన నెంచ నకట !
సకియతో నెల్లకాలము సకలసుఖము
లనుభవించెదనం చెంతొ యాసపడితి.