పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిఅటునిటులు కదులుచుండెడు నలలతోడ
నాటలాడుచు నది కెంతొ యంద మిచ్చె

అంతటను నల్లుకొని కాంతి నతిశయిల్లు
నా విమలమైన వెన్నెల నడవిమల్లె
పొదలపైనుండి కమ్మని పూలతావు
లెల్లెడం జిమ్ముచును వీచెచల్లగాలి
చచ్చిపోయినవారికి సైత మట్టె
జీవ మిచ్చి మేను నిమిరి సేద దీర్సు
చల్ల నౌమలయపవనము మెల్లవీచ
మేనిపై, నెమ్మనమెల్ల మెలుకగ అనె.

                    ------

                 ఎడభాటు
      (వాయుసందేశమునుండి)

ఘోరచింతాగహనసీమ దారి గాన
కటు నిటులు చీకటిని బ్రాకులాడుఛుండి
కడకు నిను గాంచు భాగ్యంబు గంటి నింక
వీవె నా దిక్కు నా యాశ వీవె సఖుడ !