పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కఠిననియములుగాక సత్కర్మనిరతు
లగుమహాఋషు లుండగా దిగుప్రదేశ
మచట దుర్మార్గులకు సైత మలడెడిని
సవ్రసౌఖ్యంపుమూలమౌ శాంతగుణము.
                             -----

                  వెన్నెలరేయి
        (వాయుసందేశమునుండి)

ఇంతలో చందురుం డుదయించె మింట,
వెన్నెలలు జగమెల్లను వెల్లివిరియ
పాలసంద్రంబువోలె ధావళ్య మంది
ప్రకృతి వెలుగొందెకన్నులపండు వౌచు

మెత్తనౌ దూదిమబ్బులు మింట పర్వు
లెత్తుచుండెను చందురుం డొత్తుకొంచు
బోవుచును వెండి నునుపూత బూఉచుండ
నంచులకు వినూతనశోభ లలముకొనగ
పల్లవలతాతరు లవెల్ల తెల్లనయ్యె
వెండిరేకులు నదిపైన విస్తరిల్లి