పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


            అడవిసీమ
     (వాయుసందేశమునుండి)

ఎండవేడిమి జగ మెల్ల మండ జేసి,
చండశాసనుడై వ్రజం జెండి తుదకు
కాల మైపోవ నవసానగతిని జెందు
క్రూరనరపాలునట్టుల కోష్ణకిరణు
డయ్యె సూర్యుండు, ఎల్లెడ నాకసమున
నెఱ్ఱి నౌకాంతితోడుత నెన్ని యెన్నొ
వింతర్ంగులు కలియంగ వెల్లివిరిసె
నిరుపమేద్భుతశోభలు, నేత్రపర్వ
మయ్యె నాకాంతి బ్రక్ర్తి యశ్వ్ంత మవును,
అదిమిగులు నందమౌ నొక యడవెసీమ
జానపద మెచటను చెంత గానరాదు.
నిర్మలంబును స్వచ్ఛమౌ నీటితోడ
నిరుగెలంకుల మింటికి శిరము లెత్తు
వరికేళ వృక్షమ్ములనడుమ నెగుదెంచు
నల నదీబాహమృదులగానమ్ము దక్క
వేరు శబ్దమ్ము లేవియున్ వినబడ వట.