పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదివేపకొమ్మలార ! నాల్గు
వేళల నా బిడ్డపైని
ప్రాణవాయువులను వీచి
బ్రదికించెద రనుకొంటిని !?

కాని శాస్త్రసిద్ధాంతము
కందని యొక మహాశక్తి
నాదుబిడ్డ గొంపోయెను
మీ దేమున్నది పాపము !

మినుకు మినుకు మినుకు మనుచు
మింటమెరయ చుక్కలార !
చెప్ప రేల మీలో నా
చిన్ని తల్లియెవ్వరొక్కొ ?

చెప్పవద్దులే వరాల
కుప్పను కాపాడి మరల
నప్పగింపు డీ స్వర్గము
నందున మా కంతె చాలు !

అమృతకిరణ కన్నె మంగ
శప్రద బ్రదికింప జాల