Jump to content

పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడుపూ సందరమైతె
కాలవ సారాయైతె
పడుతూ లేత్తూ తాగి
బాగా కై పెక్కాలి
ఎల్లొద్దామా పుల్లీ ఎల్లొద్దామా
కల్లు దుకానాని కెల్లొద్దామా!

వెఱ్ఱిపిల్ల

గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా
తియ్యని పాయసమోయ్‌ బావా
తీరుగ వండానోయ్‌ బావా
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!