పుట:Geetham Geetha Total.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ॥ 1) గురువునే దూషించితే.... కోటి జన్మలు కలుగుతాయి
గురువునే సేవించితే... జన్మ కర్మలు తొలగుతాయి
గురువును సేవించు ఓయీ.. లేదు అంతకు మించిముక్తి
జ్ఞానమే నా జీవితం....., జ్ఞానమేరా శాశ్వతం....
జ్ఞానమే నాకున్నదీ..... జ్ఞానమే నా పెన్నిధి....

2) దివ్వెలా వెలిగేటి చురుకైన జీవాత్మ
చిక్కుబడి పోయింది జన్మలో ఈనాడు
ఏమిటో ఈ కర్మా........
ఏమిటో ఈ కర్మ.... ఇకనైన చూడవోయీ....
ఆ రహస్యమ్‌ కాస్త ఇకనైన తెలియవోయీ...
నిండుగా నీవు ముక్తి పొందాలి.... అందుకు నీకు నేను చెప్పాలి
కోర్కెలను లేకుండా చేయమంటాను.... అహమును తీసేయమంటాను
చంపమంటానూ........
చంపమంటానూ......... ఆ మనసూను.....
త్రుంచమంటానూ..... ఆ గుణముల......
ఏమి చేయాలన్న చేయాలి, కోరితే ప్రాణమైన ఇవ్వాలి
గురువంటే పరమాత్మా......
గురువంటే పరమాత్మ...... నీవంటే జీవాత్మ
ఒక్క జన్మే చాలు వచ్చులే మోక్షాము.......
పొందెరా........
పొందెరా మోక్షాము........ పొందెరా నిండుగా
పొందెరా జీవుండు....... పరమాత్మయంతటా
జ్ఞానమే నా జీవితం....., జ్ఞానమేరా శాశ్వతం....
జ్ఞానమే నాకున్నదీ..... జ్ఞానమే నా పెన్నిధి....