పుట:Geetham Geetha Total.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. తే. యతములై నట్టి బుద్ధీంద్రియములు మనసుఁ
గలిగి రాగభయద్వేషములను వదలి
మోక్షమే పరమాశయముగఁ దలంచు
మును లనుభవింజెదరు సదా ముక్తదశను.

29. తే. యజ్ఞ తపముల నాహార మాచరించి
సర్వలోకంబులకు మహేశ్వరుఁడ నగుచు
నఖిలభూతకోటికి హితంబాత్మఁ దలఁచు
న న్నెఱుంగుటచే శాంతి నరుఁడు చెందు.



బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

ఐదవ అధ్యాయము, కర్మసన్న్యాసయోగము సమాప్తము.