Jump to content

పుట:Geetham Geetha Total.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవంతుడిట్లనియె :-

05. తే. నాకు బహుజన్మములు గల్గె నీకు నట్లె
యెన్నియో జన్మములు మాఱె నింద్రతనయ !
వాని నెల్ల నే నెఱుఁగుదు వరుసతోడ;
నీవు దెలియంగఁజాలవు నిశ్చయముగ.

06. ఆ. అవ్యయుండ నగుచు నఖిలభూతములని
యామకుండ నగుచు నజుఁడ నగుచు
నాత్మమాయ జన్మమందుచుండును నాస్వ
భావ మైనప్రకృతి నావహించి.

07. తే. ఎప్పుడెపుడు ధర్మమునకు ముప్పు గలిగి
పృథివియందు నధర్మంబు వృద్ధిఁ జెందు,
అప్పుడప్పుడనే భూమి నవతరింతు
నన్నె సృజియించుకొని మహూేన్నతచరిత్ర !

08. ఆ. సాధుజనుల నెల్ల సంరక్షణముసేయ
దుష్ట జనులఁబట్టి ద్రుంచివైవ,
సకలధర్మములను సంస్థాపన మొనర్ప
యుగయుగంబునందు నుద్భవింతు.

09. తే. కలవిధంబున నాదివ్య కర్మములను
జన్మములను గ్రహించెడు జనుఁడు మరణ
మందియును వేఱుజన్మంబు నందఁబోఁడు;
అట్టివాఁడు ననుం బొందు నవ్యయముగ