పుట:Geetham Geetha Total.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. తే. సర్వకర్మముల్‌ నాయందె సన్న్యసించి
యాత్మచింతనమే చేతమందు నిలిపి
యాశలను మాని మమకారమసలె లేక
విగతతాపుఁడవై యుద్ధవిధి నొనర్పు.

31. తే. ఏ మనుష్యలు నాదైన యీమతంబు
శ్రద్ధ గల్గి యసూయావిరహితు లగుచు
ననుసరింపంగ నేరుతురనవరతము,
వారలనుఁ గర్మబంధముల్‌ వదలిచనును.

32. ఆ. ఎవఁడసూయ నొంది యీనామతం బను
ష్టింపఁ జనఁడొ వాఁడ చేతనుండు
సర్వవిధములైన జ్ఞానంబులకు మూఢుఁ
డగుచుఁ జెడినజనుఁ డటం చెఱుఁగుము.

33. తే. జ్ఞానిjైునను దనపూర్వ సంస్కృతంబు
లకు సమానంబు లగుక్రియలనె చరించుఁ;
ప్రకృతితోడనె ప్రాణులు ప్రాఁకులాడు
నేమి యొనరించు నిగ్రహం బింద్రతనయ !

34. తే. జ్ఞానకర్మేంద్రియముల వాసనలయందు
రాగమును ద్వేషమును సుస్థిరతఁ జెలంగు;
వశము కారాదు మనుజుండు వాని కెపుడు;
పరమశత్రువు లవి యెట్టి నరున కైన.

35. తే. విగుణ మైనను శ్రేయంబు స్వీయధర్మ
మన్యమెంత స్వనుష్ఠితంబైనఁగాని;
మరణమే మేలు స్వీయధర్మంబునందుఁ
బరులధర్మంబు గలిగించు భయముకంటె.