పుట:Geetham Geetha Total.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05. తే. ఎట్టికర్మం బొనర్పక యెవ్వఁడేని
నొక్కక్షణమైన నూరకయుండలేఁడు;
ప్రకృతి జనితగుణంబుల బద్ధు లగుచు
జనులు కర్మంబుల వశులై సల్పుచుంద్రు.

06. తే. ఇంద్రియంబులపని నిగ్రహించి యెవ్వఁ
డిరద్రియార్థంబులను స్మరియించుచుండు
నట్టి మనుజుని మూఢాత్ముఁడనుట గాక
యతనియాచార మది మిథ్య యండ్రు బుధులు.

07. తే. ఇంద్రియంబుల మనసుచే నెవ్వఁడణఁచి
కర్మఫలకాంక్ష వర్జించి కర్మయోగ
మాచరించెడిఁ గర్మేంద్రియములచేత
వానికంటెను శ్రేష్ఠండు గానఁబడఁడు.

08. తే. నీవు సర్వదా యొనరింపు నియతకర్మ;
మాచరించుట మేలు త్యాజ్యమునకంటె;
దేహి సలుపంగఁజాలఁ డీదేహయాత్ర
కర్మమును విడనాడి సంక్రందనసుత !

09. తే. యజ్ఞకర్మంబుకంటె నన్యం బొనర్పఁ,
గర్మబంధంబు జగమునఁ గల్గుచుండుఁ
గాన, ఫలములయందు సంగంబు వదలి
యజ్ఞ సంబంధ మగుకర్మమాచరింపు.

17. తే. ఆత్మయందునె రమియింప నలవరించి
యాత్మతోడనె పరితృప్తిననుభవించి
యాత్మఁ గూడుచు సంతోషమందువాని
కేదియును గార్య మనునది లేదు భువిని.