పుట:Geetham Geetha Total.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23.ఆ. శాస్త్రవిధుల విడిచి సంచరించుచు నుండు
నిచ్చ వచ్చినట్టు లేనరుండు
అట్టివాఁడు సిద్ధి నందఁడు; సుఖములఁ
బడయ లేఁడు; గనఁడు పరమపదము.

24. ఆ. కార్యములను మఱియ కార్యంబులను దెల్ప
మహీని శాస్త్రమే ప్రమాణ మగుట,
శాస్త్రవిధి నెఱింగి సలుపు కర్తవ్యంబు
లైన కర్మముల నిరంతరంబు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము సమాప్తము.