పుట:Geetha parichayam Total Book.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ద్వైతుల యొక్క వాదన. ఆలోచించి చూచినట్లయితే ఒకరిది సరియైన సిద్ధాంతమైతే మరియొకరిది తప్పు సిద్ధాంతమగును కదా! అందువలన సిద్ధాంతములనే బయల్పరచిన గురువులవద్ద కూడ మాయ పనిచేసినదనియే చెప్పవచ్చును.

సిద్ధాంతమనునది ఎప్పటికి మారునది కాకుండాలి, మరియు అసత్యమైనది కాకుండాలి. ఇంకనూ వివరము చెప్పుకుంటే సిద్ధి అనగా ప్రాప్తించునది, సిద్ధించునది అనగా అనుభవానికివచ్చునదని అర్థము. అనుభవానికి వచ్చు విషయము తెల్పువాడు సిద్ధాంతియగును. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాసనము సిద్ధాంతము రెండు ఒకటే. శాస్త్రము తెలుపువాడు శాస్త్రియని, సిద్ధాంతములను తెల్పువాడు సిద్ధాంతియని పూర్వమనెడివారు. చిన్న చిన్న శాసనములతో కూడుకొన్నదే ఒక సిద్ధాంతమగును. దీని ప్రకారము అన్ని విద్యలకంటే గొప్ప విద్యయైన ఆధ్యాత్మికము శాసనపరమైన సిద్ధాంతరూపముగ ఉండాలి. అలాగే జగత్‌ గురువులుగ పేరుగాంచిన శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతమును, మద్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశారు. ఇవి ఒకదానికి ఒకటి భిన్నముగ ఉండుట వలన ఏది సత్యము, ఏది అసత్యమని పరికించి చూడవలసియున్నది. వాటి వ్యత్యాసములు వాటిలోని సత్యాసత్యములు తెలుసుకొనుటకు ప్రమాణముగ పెట్టుకొని చూడవలసినది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే.

బ్రహ్మవిద్యకు ప్రమాణ గ్రంథమైన భగవద్గీత నూటికి నూరు పాల్లు శాస్త్రబద్దమైన సిద్ధాంతములతో కూడుకొని ఉన్నది. పరమాత్మ స్వయముగ తెల్పిన భగవద్గీత ప్రకారము చూచిన ఎడల పరమాత్మ, జీవాత్మలను రెండు లేవని పరమాత్మ ఒక్కటే గలదను అద్వైతము, జీవాత్మ పరమాత్మలు రెండు ఉన్నాయను ద్వైతము, రెండునూ గీతకు కొద్దిగ ప్రక్కమార్గములో ఉన్నాయని తెలియుచున్నది. అనగ పూర్తి సరియైన సిద్ధాంతములుకావని అర్థమగుచున్నది. గీతను ప్రమాణముగ పెట్టుకొని చూచినట్లయితే మానవమాత్రులైన గురువులు