పుట:Geetha parichayam Total Book.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి పరిచయము

పూర్వ కాలములో అన్ని మతములకంటే ముందు పుట్టినది, అన్ని మతముల కంటే పెద్దది ఒక్క ఇందూమతమేనని చెప్పుటలో సంశయము లేదు. కృతయుగమునుండే ఇందూమతము గలదు. పూర్వము ఏ ఇతరమతములు లేని కాలములో ఇందూమతము ప్రపంచ వ్యాప్తముగ ఉండెడిది. ప్రపంచములో మొదటి దేవాలయము ఆకారములేని గుండును దేవునిగ ప్రతిష్ఠించి ఆరాధించ బడినది. ప్రపంచములో మొదటి బోధ భగవద్గీత సారాంశము. భగవద్గీత ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పడమేకాక సృష్ఠి ఆదిలోనే దేవుడు సూర్యునకు తెల్పినది. గీత ఆదిలోనే చెప్పబడగ ఆదినుండి ఇందూమతము గలదు. కాలక్రమమున ఇందూమతము అనేక మతములుగ చీలిపోయినది. ఇందూమతము అనగ దేవుని విషయమును తెల్పుమతమని అర్థము. ఇందు అనగ దేవుని జ్ఞానమని అర్థము. దీని ప్రకారము ప్రస్తుత కాలములో క్రైస్తవ, ఇస్లామ్‌ మతములుండినప్పటికి అవన్నియు సృష్ఠికర్త అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున ఆ మతములు కూడ ఇందూ మతములోని అంతర్‌ భాగములనే చెప్పవచ్చును. అలాగే క్రైస్తవ, ఇస్లామ్‌ మతములలోని బోధలు రూపనామములు లేని సర్వవ్యాపి అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున అవి కూడ గీతలోని అంతర్భాగములనియే చెప్పవచ్చును.

ఇతర మతములలోని అర్థము, ఆరాధనా జ్ఞానమును కల్గియున్నది భగవద్గీత. అన్ని మతముల సారాంశము ఇందూమతములో ఉండగ, అన్ని మతముల జ్ఞానము భగవద్గీతలో గలదు. సర్వమత జ్ఞానము కల్గిన గీత నేడు ఇందూమతములో ఉండినప్పటికి ఇందూమతములో జ్ఞానము తెలియని ప్రజలు తమ మతము యొక్క ఔన్నత్యమును తెలియలేక తమ మతము పేరునే