పుట:Geetha parichayam Total Book.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రమని పలానా శ్లోకమును మంత్రమువలె చదువుట వలన పలానా పని నెరవేరునని చెప్పారు. ఈ శ్లోకము చదువుట వలన ఈ రోగముపోవునని, మరియొక శ్లోకము వలన కోర్టులోని వ్యాజ్యమును గెలుచుదురని, అట్లే సంతానమునకొక శ్లోకము, ధనప్రాప్తికొక శ్లోకము పనికివచ్చునని చెప్పినవారు కూడ కలరు. అది చూచిన మేము ప్రపంచ పనులకు కాదయ్య గీత ఉన్నది, మనము జ్ఞానము తెలుసుకొనే దానికని చెప్పితే, జ్ఞానము అర్జునునికి చెప్పాడు గాని మనకు కాదయ్య అంటున్నారు. అర్జునునకు చెప్పినదే మనకు పనికి వస్తుంది. దాని వలన జ్ఞానము తెలిసి మోక్షము పొందవచ్చునని మేమంటే, దానికి జవాబుగ పెద్దలు దీని వలన మోక్షమొస్తుందని చెప్పలేదే! ఈ శ్లోకము చదివితే ఈ పని నెరవేరునని చెప్పారు కదా! ఈ అధ్యాయము చదివితే ఈ ఫలితముంటుందని వ్రాశారు. నాకు ఇపుడు కోర్టులో కేసువున్నది, కావున అది నెరవేరుటకు ఇది సరిపోవునని పెద్దలు చెప్పిన శ్లోకమును ప్రతిదినము పఠించుచున్నానన్నాడు. ఇలా గీతామహత్యము ప్రజలను గీతకు దగ్గర చేసినది కాని గీత యొక్క భావమునకు దూరము చేసినది. గీతకు మహత్యముందని తెలుసుకొన్నవారు శ్లోకములను పారాయణము, పుస్తకమును పూజచేయు చున్నారు తప్ప గీతలోని జ్ఞానమునకు దగ్గర కావడము లేదు. నేటి నుంచి గీతను చదువువారు శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునునికి మాత్రమేకాదు, మనకు కూడ చెప్పాడని అందులోని భావము గ్రహించి చదవండి. అంతో ఇంతో జ్ఞానులైనవారు గీతామహత్యమును చదవకుండ గీతలోని విషయములనే చదివి అర్థము చేసుకోవాలి. గీతామహత్యము ప్రకారము ఏవో ప్రపంచ కోర్కెలు నెరవేరునను ఉద్దేశ్యముతో గీతను చదువకూడదు. ఫలితముల మీద ఆశ లేకుండ చదవాలి. గీతకు, గీతామహత్యమునకు ఎలాంటి సంబంధము లేదని, గీత శాస్త్రబద్దమైనదని, గీతామహత్యము శాస్త్రముకాదని, అది కేవలము పురాణమని తెలియాలి. ఇట్లు విశదీకరించుకొంటూ పోతే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా! అను ప్రశ్న కూడ ఉద్భవించుచున్నది. గీత యుద్ధరంగములో మొదలైనది. ఆ యుద్ధము ఎందుకు సంభవించినదో అందరికి తెలుసు. నిజము