పుట:Geetha parichayam Total Book.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలా ఎందరో గీతకంటే గీతామహత్యములో చెప్పిన మాటలనే ఎక్కువగ నమ్మి నడుచుకొనుచున్నారు. అలాంటి మరియొక వ్యక్తితో కలిసి గీతలోని విషయములను అడుగగా అందులోని వివరము మాకు తెలియదన్నాడు. ఇదేమి విచిత్రము గీతను ప్రతిదినము చదువుచున్నారు కదా అని అడిగితే "అవునయ్యా గీతను ప్రతిదినము చదివితే అందులోని విషయములతో మాకు ఏమి పని" అని అన్నాడు. మరి ఆ విషయములతో పనిలేనిది ఎందుకు గీతను చదువు చున్నారని అడిగితే మోక్షముకొరకని సమాధానము చెప్పాడు. మోక్షమంటే ఏమిటని వివరము తెలిసి దానిని పొందాలంటే గీతలోని ధర్మములు తెలియాలి కదా! అని అడిగితే, అతను నవ్వి కొండనుత్రవ్వి ఎలుకను పట్టినట్లు అంతశ్రమ ఎందుకయ్యా మేము సులభముగ మోక్షము పొంది ఉన్నామన్నాడు. ఏమిటి బ్రతికియున్నట్లే మోక్షమా! దేహముతో ఉన్నపుడే మోక్షము పొందారా అని అడిగితే "అవునయ్యా గీతామహత్యములో 19వ శ్లోకము చూడలేదా! గీతను, గీత అర్థమును చదువుట వలన దేహముతో ఉండియే మోక్షము పొంది ఉందురని ఉన్నది కదా! నేను తూచ తప్పక ప్రతి దినము గీతశ్లోకములు తాత్పర్యము చదువుచున్నాను. కావున గీతామహత్యము ప్రకారము నేను ఇపుడు మోక్షములోనే ఉన్నట్లు" అని అన్నాడు. అలా కాదయ్యా మోక్షమంటే శరీరమును వదలి, ఏ శరీరము ధరించక అణువణువున వున్న పరమాత్మయందు కలిసిపోయేదని మేమంటే, అతను కోపగించుకొని "విష్ణువు చెప్పిన గీతామహత్యమునేకాదని ఇది మోక్షముకాదంటావా! నీకేమి తెలియదుపో" అన్నాడు. ఇలా ఎందరో గీతామహత్యములోని మాటలనే నమ్మి అసలైన ధర్మములను వదలి గీతకే వ్యతిరేఖముగ మారిపోయి ఉన్నారు. ఇందులో మొదటి తప్పు గీతా మహత్యమును చెప్పిన వారిదేయగును. వాస్తవానికి చెప్పినవారు ప్రజలను తప్పు దారి పట్టించాలని చెప్పలేదు, మంచియే చేయాలని చెప్పారు. కాని అది ప్రజలయెడల దురదృష్టవశాత్తు తప్పుగ పరిణమించినది.

అదే పద్ధతిలో మరికొందరు పెద్దలు గీత శ్లోకములు చదువుట వలన ప్రపంచ పనులు నెరవేరునని ఆశను కల్పించారు. ఒక్కొక్క శ్లోకము ఒక