పుట:Geetha parichayam Total Book.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంతో ఇంతో జ్ఞానమున్నవారు కూడ గీతామహత్యము, గీతకు వ్యతిరేఖముగ ఉన్నదేనని యోచించక నిత్యము పారాయణము చేయడము మరిమరి విచిత్రము. ఈ మా మాటలకు కొందరికి కోపమొచ్చి మా మాటలు అజ్ఞానపరమైనవని గొంతెత్తి అరవవచ్చును. పాఠకులుగ మీరు స్వయముగ యోచించుస్థితికి రండి. ఒకనాడు సత్యమును చెప్పిన ఏసుప్రభువును ఆనాటి జ్ఞానులు దైవదూషణ చేయువానిగ లెక్కించి హింసించి చంపారు. సత్యము తెలుసుకొన్న తరువాత ఆనాటి ఏసు మాటలు ఈనాడు శిరోధార్యమైనాయి. అట్లే ఒకనాడు ఖగోళ రహస్యములను చెప్పిన గెలీలియో అనునతనిని ఆనాటి జ్ఞానులన్నవారు చిత్రహింసలపాలు చేశారు. మరి ఈనాడు ఆ గెలీలియో మాటలే ఖగోళశాస్త్రజ్ఞులకు ఆధారమైనాయి. అందువలన మన లెక్కలో జ్ఞానులను పేరుకల్గిన వారు ఇది అసత్యమని అరచినంత మాత్రమున మీరు తొందరపడక ఆలోచించి చూడండి. అపుడే సత్యము తెలియగలదు.

మేము ప్రకటించిన నాలుగు సూత్రములలో నాల్గవ సూత్రము ప్రకారము చూచినట్లయితే గీతామహత్యము అశాస్త్రీయమని తెలియగలదు. గీత యోగశాస్త్రము కాగ, గీతామహత్యము వరాహపురాణమగుట గమనింపదగిన విషయము. శాస్త్రములకు పురాణములకు ఎంతో తేడాగలదనుటకు నిరూపణగ శాస్త్రమైన గీత జన్మరాహిత్యమును తెలుపగ, పురాణమైన గీతామహత్యము గీతపారాయణము వలన ప్రపంచమున్నంత వరకు మానవ జన్మకలుగునని తెల్పినది. గీతామహత్యమందు 13వ శ్లోకమున గీతను ప్రతిదినము ఒక అధ్యాయము చదువుట వలన మన్వంతరము వరకు నరజన్మమును పొంది, భూమి మీద పుట్టుచుందురని గలదు. ఇది గీతకు వ్యతిరేఖమైన మాటకాదా!

పగలంతయు పాపము చేసి సాయంత్రము గీతను చదివెడువారు, వినెడివారు కొందరున్నారు. ఎందుకనగా! గీతను వినుటవలన చేసుకొన్న పాపమంతయు పుణ్యముగ మారునని గీతామహత్యమున 18వ శ్లోకములో