పుట:Geetha parichayam Total Book.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది"భగవద్గీత" అనగ భగవంతుడైన శ్రీకృష్ణుడు పల్కినదేగాని అర్జునుడు పల్కినదికాదని తెలియుచున్నది. అలాంటపుడు భగవద్గీత ఎక్కడి నుండి మొదలైనదను ప్రశ్న ఉద్భవిస్తే! వైద్యులు చెప్పినదే వైద్యమన్నట్లు భగవంతుడు చెప్పినదే భగవద్గీతయగును. కావున భగవంతుని మాటలు ఎక్కడినుండి మొదలైనవో అక్కడినుండే భగవద్గీత మొదలైనదని నిస్సంకోచముగ చెప్పవచ్చును. మనకు అవసరమైనవి, మనము తెలుసుకో తగిన విషయములు, భగవంతుని మాటలతోనే మొదలైనవి. భగవంతుని మాటలు జీవులు తెలుసుకోతగ్గ హద్దు కావున వాటిని " గీత" అనడము జరిగినది.

ఇక్కడ కొందరికొక సంశయము రాగలదు. అదేమనగా! రోగి లేనిది వైద్యుడు, రోగము లేనిది వైద్యము అవసరము లేదు కదా! అలాంటపుడు అర్జునుడు చెప్పిన విషాదయోగము భగవద్గీతలో ప్రాముఖ్యము కాదా! అని అడుగవచ్చును. దానికి సమాధానమేమనిన విషాదమన్నది ఆనాటి అర్జునునికే కాక ఈనాటి మానవులందరికి విషాదమున్నది. అలాంటపుడు గీత మానవులందరికి అవసరము. విషాదమున్నది ఆనాటి అర్జునునికేనన్నట్లు ఆయన యొక్క విషాదమునే చెప్పుకోనవసరము లేదు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు భవరోగములున్న వారందరకి వైద్యములాంటివే, భవరోగములనునవి మానవులైన మనందరకున్ననే ఉన్నవి. కావున అర్జున విషాదయోగమను అధ్యాయమును భగవద్గీత అను పేరుతో చెప్పుకోనవసరము లేదు. భగవద్గీతను ప్రతి పుస్తములోను భగవంతుడు చెప్పిన విషయముల నుండియే ప్రారంభించి వ్రాసి ఉంటే ఎంతో బాగుండేది. అలాకాక ప్రతి భగవద్గీతలోను అర్జున విషాదయోగముతో మొదలు పెట్టిన దానివలన చదివిన వారందరు శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పాడని, ఆ విషయములు అర్జునుని కోసమేనని, అర్జునుని చేత యుద్ధము చేయించే దానికొరకేనని, అధైర్యపడిన పార్థుని ధైర్యపరుచుటకేనని, కేవలము అర్జునుని నిమిత్తమే భగవద్గీత ఉన్నట్లు తలచుచున్నారు. అర్జున విషాదయోగము చదివిన కొందరు "అర్జునునకు బాధ ఉన్నది. కావున ఆయనకది