పుట:Geetha parichayam Total Book.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖురాన్‌యందు ఇస్లామ్‌ పేరుండుట వలన ఆయా గ్రంథములను ఆయా మత గ్రంథములనుటలో అర్థము కలదు. కాని భగవద్గీతయందు ఏ మతము పేరు లేదు, చెప్పినవాడు ప్రవక్తగాదు, అటువంటపుడు అది ఒక మత గ్రంథమనుటలో అర్థమే లేదు.

భగవద్గీతను అర్థము చేసుకొంటే మానవ జాతికంతటికి అధిపతియైన దేవుడున్నాడని తెలియగలదు. అందువలన అందరికి అధిపతియైన దేవున్ని గూర్చి తెలుసుకొను నిమిత్తము భగవద్గీతను చదువవలెనని కోరుచున్నాము. బహుశ కొందరు భగవద్గీతను ఇప్పటికే చదివివుండవచ్చును. అందులో యోచించు వారికి సంశయములు ఉండవచ్చును. సంశయములు తీరక గీతకు దూరముగ, నాస్తికులుగ కొందరు మారివుండవచ్చును. అలాంటి వారినందరిని దృష్టిలో పెట్టుకొని వారియందు ఉద్భవించిన ప్రశ్నలను సేకరించి ఆ ప్రశ్నలకు సరియైన జవాబు నొసగు భగవద్గీతను మేము వ్రాయడము జరిగినది. చదువరులైన మీరు మా వ్రాతలలోని ఏ విషయమును గ్రుడ్డిగ నమ్మక యోచించి నిర్ణయించుకోండి. మేము చెప్పు విషయములు కొన్ని మీరింతవరకు విననివిగ ఉండవచ్చును. పూర్వము ఎవరూ ఈ శైలిలో చెప్పక వేరుగ చెప్పివుండవచ్చును. అయినప్పటికి వాస్తవికతను అర్థము చేసుకోగలరను భావముతోనే వ్రాయుచున్నాము.

భగవద్గీతను శ్రీకృష్ణుడు యుద్ధరంగమున బోధించాడని అందరికి తెలియును భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునితో "ఇది రహస్యమైన జ్ఞానము, నీకు మాత్రమే బోధిస్తున్నాను" అని అన్నాడు. అలాంటపుడు అర్జునునికొక్కనికే తెలిపిిన విషయమును సంజయుడెలా వినగలిగాడు? అన్నది ప్రశ్న. ఒకవేళ దూరదృష్టి, దూరశ్రవణము సంజయుడు కలిగివుండవచ్చును. ఆ విషయము శ్రీకృష్ణునికి తెలియకుండానే సంజయుడు యుద్ధరంగములోని ప్రతి విషయమును ధృతరాష్ట్రునికి తెలియజేయుచున్నాడనుకొందాము. విశ్వరూప సందర్శన సమయమున "ప్రకృతి కన్నులతో నా విశ్వరూపమును చూడలేవు, నాయొక్క