పుట:Geetha parichayam Total Book.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగు కారణముల చేత గీతయొక్క విలువ భారతదేశములోనే తెలియకుండ పోయినది. అందువలన ఇతర మతస్థులు కూడ గీతను గురించి హేళనగ మాట్లాడు అవకాశము గలదు. కొందరు ఇందువులే గీతను చిన్నచూపు చూచుచున్నారు. ఇందూమతమునకు మూలగ్రంథము భగవద్గీతయని తెలియనివారు చాలామంది ఇందూమతమును వదలి ఖురాన్‌, బైబిలు మొదలగు మూలగ్రంథములున్న ఇతర మతములలోనికి పోవుచున్నారు. అన్ని మతముల సూత్రములు భగవద్గీతలో భాగమైవుండగ, ఇందూమతమునే వదలి ఇతర మతములలోనికి పోవడమునకు కారణము, భగవద్గీత యొక్క సారాంశముగాని, దాని విలువగాని ఎవరికి తెలియక పోవడమేనని తెలియుచున్నది. ఎంతో మంది భగవద్గీతను అనేక భాషలలో అనువదించివుండగ, ఇందూమతములో ఇప్పటి వరకు దాదాపు మూడువందల మంది స్వామిజీలు గీతకు భాష్యము వ్రాసివుండగ, గీతబోధకులమని కంకణము కట్టుకొనివుండువారు అనేకులుండగ, ఈ మతమునే వదలిపోవు పరిస్థితి ఎందుకు ఏర్పడినదో అందరు ఆలోచింప తగిన విషయము. ఇప్పటికి పల్లెల ప్రాంతములలో గీత అంటే ఏమిటో తెలియనివారు 90 శాతముగలరు. వీటన్నిటికి కారణము గీత ఇప్పటి వరకు సరైన విధానములో శాస్త్రబద్దముగ బోధింపబడకపోవడమేనని చెప్పవచ్చును. శాస్త్రమును శాస్త్రముగ కాక పురాణమువలె బోధించడము వలనను, ఎన్నో పురాణవిషయములు గీతలో కలపడము వలనను, ముఖ్యముగ ముక్తి కొరకు భగవద్గీత అని తెల్పక, భుక్తి మరియు జీవనసరళికొరకని గీతామహత్యమును చేర్చడము వలన, యోగశాస్త్రమైన గీత దానివిలువను కోల్పోయినదని తెల్పుచున్నాము. భగవద్గీత ధర్మయుక్తమైనది కాగా అధర్మయుక్తమై పోయినట్లు కన్పిస్తున్నదని తెల్పుచున్నాము.

భగవంతుడు తెల్పిన స్వచ్ఛమైన, శాసనబద్దమైన, యోగశాస్త్రమైన భగవద్గీత ఇటువంటి సమయములో పూర్తి అవసరము. ఏ మతస్థులు, ఏ దేశస్థులు విమర్శించలేనిది, ఇది మా మతమునకు సంబంధించినదేనని