పుట:Geetha parichayam Total Book.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరుద్ధమైన మాట. మనిషికి లభ్యమగు ఇల్లు వాడు పుట్టినపుడే ప్రారబ్ధములో నిర్ణయించబడివుండును. మధ్యలో ఎవరూ నిర్ణయించలేరు. ఒకరికి ఎటువంటి ఇల్లు జీవితములో దొరుకునను విషయము జ్యోతిష్యములో ఉండును. అంత తప్ప ఇంటిని గురించి ప్రత్యేకమైన శాస్త్రములేదని గుర్తించవలెను.

శాస్త్రములు ఆరు, పురాణములు పదునెనిమిది సంఖ్య ఎప్పటికి మారునది కాదు. ఆరు శాస్త్రములలోని గణితశాస్త్రముతో జ్యోతిష్యశాస్త్రము ముడిబడియున్నది. అందువలన గణితములేని జ్యోతిష్యముండదు. అలాగే జ్యోతిష్యశాస్త్రముతో ఖగోళశాస్త్రము ముడిబడియున్నది. అట్లే ఖగోళశాస్త్రముతో రసాయనిక శాస్త్రము, రసాయనికశాస్త్రముతో భౌతికశాస్త్రము, భౌతికశాస్త్రముతో యోగశాస్త్రము అనుసంధానమై ఉన్నవి. భౌతికమనగా శరీరమునకు సంబంధించినది. మానవుడు శరీరము ధరించివున్నాడు. శరీరములో ఎన్నో భాగములతో నివాసము చేయు జీవాత్మ, పరమాత్మలోనికి ఐక్యము కావడానికి యోగశాస్త్రమును తెలిసి తీరాలి. గణితము, జ్యోతిష్యము, ఖగోళము, రసాయనికము, భౌతికము అను ఐదుశాస్త్రములు మానవుని మనుగడలో ప్రపంచసంబంధముగ ఉపయోగపడుచున్నవి. ఆరవ శాస్త్రమైన యోగశాస్త్రము మాత్రము మానవునికి ప్రపంచసంబంధముగాకాక పరమాత్మ సంబంధముగ ఉపయోగపడుచున్నది. మానవుడు ప్రపంచములో బ్రతుకుటకు ఐదుశాస్త్రములు కావలసియుండగ, ప్రపంచమును వీడి పరమాత్మలోనికి ఐక్యము కావడానికి, ఆరవశాస్త్రమైన యోగశాస్త్రము తప్పనిసరిగ అవసరము. మానవునికి తప్పనిసరిగ అవసరమైన యోగశాస్త్రము అనునది ఏది? ఎక్కడ గలదని కొందరడుగవచ్చును. అందరికి అవసరమైన యోగశాస్త్రమును గురించి, దానివిలువ గురించి ముందు తెలుసుకోవడము కూడ ముఖ్యమే.

మానవునికి అతిముఖ్యమైన శాస్త్రము యోగశాస్త్రము. యోగ శాస్త్రములో మానవుని కర్మను రూపుమాపు విధానము గలదు. కర్మనిర్మూలనా సూత్రములను మానవుడు బోధించలేడు, కావున స్వయముగ పరమాత్మయే