పుట:Geetha parichayam Total Book.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది1) శిక్ష :- ఇందు వేద శబ్దముల యొక్క అక్షరముల స్థాన జ్ఞానములను, ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరముల జ్ఞానమును చెప్పబడి ఉన్నది. ఉదాత్తమనగ ఉచ్ఛము, అనుదాత్తమనగ నీచము, స్వరితమనగ సమానము అని తెలియవలెను. ఈ శిక్షా శాస్త్రములను వ్యాస శిక్ష, భరద్వాజ శిక్ష, నారదశిక్ష అని మూడు విధములుగ చెప్పుచున్నారు. ఇది ఒకటవ శాస్త్రమైన శిక్షలో ఉన్న పద్ధతి. వేదశబ్దములు ఇలా పలువలెనని ఒకచోట గట్టిగ, ఒకచోట చిన్నగ పలుకుటకు చెప్పిన పద్ధతిని శాస్త్రమన్నారు. అదియు ఒక శాసనరూపము గాక ఇది నారదుని పద్ధతని, ఇది వ్యాసుని పద్ధతని, ఇది భరద్వాజ పద్ధతని తెలిపినారు. దానిని బట్టి వ్యాసుడు పల్కినట్లు భరద్వాజుడు పల్కలేదని, భరద్వాజుడు పల్కినట్లు నారదుడు పల్కలేదని తెలియుచున్నది. శాస్త్రము ఒకే పద్ధతి కల్గి ఎప్పటికి మారదను సూత్రమునకు శిక్షాశాస్త్రము విలువలేకుండ చేసినది. మధ్యలో కల్పించబడిన ఇటువంటి శాస్త్రములను వదలి నిజమైన శాస్త్రములేవో తెలుసుకొందాము.

పురాణములకంటే శాస్త్రములు ఎంతో ముందుపుట్టినవి. అవి వరుసగ ఈ విధముగ గలవు 1) గణిత శాస్త్రము 2) జ్యోతిష్యశాస్త్రము 3) ఖగోళశాస్త్రము 4) రసాయనిక శాస్త్రము 5) భౌతికశాస్త్రము 6) యోగశాస్త్రము. ఈ ఆరు శాస్త్రములు మినహా ఏ శాస్త్రములు లేవు. ఇక్కడ కొందరొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! ఈ ఆరు శాస్త్రములకంటే నేడు బాగా ప్రచారములో ఉన్నది వాస్తుశాస్త్రము. ఇల్లు కట్టించుకొను వారంతా వాస్తుశాస్త్రము ప్రకారము కట్టించుకొనుచున్నారు. అది విూలిస్టులో లేదే అని అడుగవచ్చును. దానికి మాజవాబు ఏమనగా! మేము చెప్పిన ఆరు శాస్త్రములు తెలిసినవారు చాలా తక్కువగ ఉన్నారు కాని, వాస్తుశాస్త్రజ్ఞులు మాత్రము ఎక్కడ చూచిన తయారైనారు. ఇక దీని విషయము గురించి చెప్పాలంటే ఇప్పుడున్న వాస్తుశాస్త్రమనేది అసలు కల్ల. వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవాలనడము మరీ విచిత్రమైన మాట. వాస్తుప్రకారము లేని ఇంటిలో కష్టాలు,నష్టాలు వస్తాయనడము యోగశాస్త్రమునకే