పుట:Geetha parichayam Total Book.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


5×4=20 అన్నది శాసనము. ఇది ఒక్క మారు చెప్పబడి నదైనప్పటికి చిరకాలము ఉండిపోయినది. ఎప్పుడైన ఎక్కడయిన జరిగితీరునది శాసనము లేక శాస్త్రము అన్నట్లు, 5×4=20 అను మాట ఎప్పటికీి మారదు. ఈ విధముగ ఉన్నవి శాస్త్రములని తెలుసుకొన్నాము. పురాణములు ఒక రకమైన గ్రంథములు కాగ, శాస్త్రములు మరొక రకమైన గ్రంథములు. ప్రయాణము ఒకటే అయిన తూర్పు పడమర దిశలు వేరైనట్లు, ఉద్దేశ్యము ఒకటే అయిన పురాణములువేరు, శాస్త్రములువేరు. తూర్పు, పడమరకున్నంత తేడా పురాణములకు శాస్త్రములకు గలదు. వాటి వ్యత్యాసమును గ్రహించలేక అన్నీ పుస్తకములే కదా అంటే స్త్రీకి, నపుంసకునికి తేడా తెలియనట్లగును. అందువలన ఏ పుస్తకము ఏ కోవకు చెందినదో, శాస్త్రమేదో, పురాణమేదో, వాటికున్న వ్యత్యాసమేమో తెలియవలసిన ఆవశ్యకత చాలా ముఖ్యము. అలా కాకపోతే కాళ్లవిూద పోసుకోవలసిన దుమ్మును నెత్తివిూద, నెత్తివిూద పోసుకోవలసిన నీటిని కాళ్లవిూద పోసుకొన్నట్లుండును. కాళ్లకు దుమ్ము అయినప్పటికి తలవిూద నీరు పోసుకొంటే శరీరమంత తడిసి శుభ్రపడడమే కాక, కాళ్లకున్న దుమ్ముకూడ నీటిలో కొట్టుకొనిపోయి కాళ్లుకూడ శుభ్రము కాగలవు. అలాకాక కాళ్లవిూద నీరుపోసుకొని తలవిూద దుమ్ము పోసుకొంటే అంతవరకు శుభ్రముగనున్న శరీరమంత అశుభ్రముగ మారును. ఆ విధముగనే పురాణములు ఏ గ్రాహితములేని వారికి ప్రాథమికముగ తెలుసుకొనుటకని, కొంత గ్రాహితశక్తి గలవారికి శాస్త్రములు అవసరమైనవని తెలియాలి. అలాకాక గ్రాహితమున్న వారు పురాణములు చదివినా, గ్రాహితము లేనివారు శాస్త్రములు చదివినా ఏమాత్రము వారికి రుచింపవు. ఈ కారణము చేతనే కొందరు పురాణములను అర్థము చేసుకొన్నట్లు, శాస్త్రములను అర్థము చేసుకోలేక పోవుచున్నారు. మరికొందరు శాస్త్రములను తెలిసి పురాణముల జోలికిపోకున్నారు.

ఇపుడు మనము చూడబోవు భగవద్గీత నూటికి నూరుపాళ్ళు శాస్త్రము కావున పురాణములలోనికి దీనిని కలుపకూడదని ముందే తెలుపుచున్నాము.