పుట:Geetha parichayam Total Book.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిదారిలో వస్తున్న వారు వేషభూషణములలో స్త్రీలే అయినప్పటికి వారి భౌతిక శరీరములలో తేడాగలదు. ఇద్దరిలో ఒకరు స్త్రీకాగ రెండవ వారు నపుంసకులు. నపుంసకుని శరీరము పురుషాంగము కల్గియుండట వలన నపుంసకుడిని స్త్రీ అనలేము. పైకి కనిపించుటకు అన్నివిధముల స్త్రీవలె ఉన్నప్పటికి లోపల మాత్రము శరీరము వేరుగ ఉన్నది. మొదట దూరమునుండి చూచినపుడు గుర్తించ లేక స్త్రీలనుకొనిన ఫరవాలేదు గాని, దగ్గరికి వచ్చిన తర్వాత కూడ గుర్తించలేని వారిని తెలివితక్కువ వారని చెప్పవచ్చును. అంతేగాక గుడ్డలూడదీసి చూచినప్పటికి స్త్రీపురుషుల తేడాను గుర్తించలేని వారిని మరీ మూర్ఖులని చెప్పవచ్చును. దారిలో వస్తున్న స్త్రీలు కనిపించినట్లే, భూమి విూద పైకి కనిపించుటకు ఆకారములో ఒకే పోలిక కల్గిన రెండు రకముల తేడాలున్న పుస్తకములు గలవు. వాటిని చూచువారు కూడ మూడు రకముల వారు గలరు. పుస్తకములు ఒకే ఆకారములున్నప్పటికి వాటిలోపల తేడాలున్నవని చెప్పు మొదటి రకము వారూ గలరు. అలాగే ఆ తేడాను మొదట గుర్తించలేక పోయినప్పటికి తర్వాత గుర్తించి, ఆ విషయమును బయటికి ఒప్పుకోక ముందునుండి చెప్పుమాటనే చెప్పు రెండవ రకమువారూ గలరు. పుస్తకములు అన్ని ఒకరకముగానే ఉన్నవి కదా! అని వాటి తేడాను ఏమాత్రము ఒప్పుకోని మూడవ రకమువారు కూడ గలరు.

భూమి విూద పుస్తకములు అన్నియు ఒకే ఆకారము కల్గి ఉన్నప్పటికి వాటిలోని విషయములను బట్టి పురాణములు, శాస్త్రములని రెండురకములుగ విభజింపవచ్చును. కనిపించుటకు అన్నీపుస్తకములే అయినప్పటికి, వాటిలోని విషయములనుబట్టి పురాణములని, శాస్త్రములని విభజించుకొని గుర్తించు మొదటిరకము మనుషులుగలరు. మొదట అన్నీ పుస్తకములేకదా! అది శాస్త్రమైతే ఇది ఎందుకు శాస్త్రముకాదని వాదిస్తు, చివరకు వాటి తేడాను గమనించి బయటపడక, ముందు మాటనే మాట్లాడుచుపోవు రెండవ రకము వారు గలరు. అలాగే వాటి తేడాను కనుగొనలేక అన్ని ఒకటే కదా! అని మొండిగ వాదించు మూడవ రకము వారు గలరు.