పుట:Geetha parichayam Total Book.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఈనాటి మానవుని బుద్ధికి ఆధ్యాత్మిక విషయములలో పూర్తిస్థాయి అవగాహన లేకుండపోవుచున్నది. ఉదాహరణకు ఒక దారిలో ఇద్దరు స్త్రీలు పోవుచున్నారు. అదే దారిలోనే ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఫర్లాంగు దూరములో వస్తున్న ఇద్దరు స్త్రీలలో ఒకరు స్త్రీకాగ, ఒకరు నపుంసకుడై ఉండెను. చీర, రవిక కట్టడములోను, వేషధారణలోను, అలంకారములోను నపుంసకుడు స్త్రీతో సమానముగ ఉండుట వలన దూరము నుండి చూచినపుడు ఇద్దరిని స్త్రీలనుకోవడములో తప్పులేదు. మొదట ఇద్దరిని, స్త్రీలని దారి ప్రక్కన కూర్చున్న వారనుకున్నారు. ఆ స్త్రీలు కొంత దగ్గరవుతూనే ముగ్గురిలో ఒకటవ వాడు, వారిలోని నడక, ముఖవర్చస్సు యొక్క కొద్దిపాటి వ్యత్యాసమును బట్టి వస్తున్నది ఇద్దరు స్త్రీలుకాదు, అందులో ఒకరు మాత్రము స్త్రీ కాగ ఒకరు నపుంసకుడని చెప్పాడు. ఆ మాటవిన్న రెండవవాడు, మూడవవాడు వారిలోని వ్యత్యాసమును కనుగొనలేక, "కాదు ఇద్దరూ స్త్రీలే" అన్నారట. ఇలా వారనుకొన్న కొద్దిసేపటికే దారిన పోయే ఆ ఇద్దరు దగ్గరకొచ్చారు. దగ్గరగ చూచిన రెండవ వానికి కొంత అర్థమైపోయి ఒకరు నపుంసకుడే అని నిర్ధారణకొచ్చాడు, కాని పైకి ఒప్పుకోలేదు. ఇంతసేపు కాదని ఇపుడు ఒప్పుకుంటే తనకు విలువుండదను కొన్నాడు. మూడవవాడు మాత్రము చాలా తెలివితక్కువవాడు కాబోలు అప్పటికి కూడ వానికి అర్థము కాలేదు. వారిలోని తేడాను కనుగొనలేక పోయాడు. మొదటివాడు ఎన్నో తేడాలు చెప్పుచున్నప్పటికి, మూడవ వానికి ఏమాత్రము అర్థము కాలేదు. పైకి కనిపించు ఆకారములే ముఖ్యమనుకొన్నాడు. లోపలగల లింగభేదమును గ్రహించలేక పోయాడు. చివరకు ఈ విధముగ ఏమి చెప్పిన ఒప్పుకోను, ప్రత్యక్షముగ చీరకట్టుకున్న ఆడవారు కనిపిస్తుంటే ఎలా కాదనాలి? నేను నమ్మనుగాక నమ్మను. చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రము ఇన్ని ఉంటే ఆడది కాదంటావా నీకు బుద్ధిలేదుపో అన్నాడు. రెండవవాడు మాత్రము మొదటివాని మాటను లోపల ఒప్పుకొనినప్పటికి, బయటికి మాత్రము మూడవవాడు చెప్పినదే నిజమన్నాడు.