పుట:Geetanjali (Telugu).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

గీతాంజలి.

నిన్ను నెవడని నేను బ్ర ♦ శ్నింపలేదు;
సిగ్గు నెఱవుల నెఱుగక ♦ చెలగుచుంటి;
జీతివం బెల్ల గజిబిజి ♦ జెంది యుండె;
గేవలము స్నేహితునివలె ♦ దేవ ! నీవు
వేకువను లేపుచుంటివి ♦ వింతగాను.
పఱచినడుపుచు నుంటివి ♦ వనపధముల
ఆదినములందు నీచేయు ♦ నందమైన
గానములలోనియర్ధంబు ♦ గనుగొనంగ
నాకు నింతయు లక్ష్యంబు ♦ లేకయుండె.
మట్లుమాత్రమె గ్రహియించె ♦ మద్గళంబు
అట నంతయు జాలించి ♦ నప్పుడిప్పు
దహహ ! తటుకున గనబడు ♦ నది యిదేమి?
సద్ధుసేయనినక్షత్ర ♦ సమితి గూడి
జగము కనులను వాల్చి నీ ♦ చరణములను
నద్భుతంబుగ నిలబడె ♦ నద్భుతముగ.

98


నాదుభంగమ్ము దాల్చుహా ♦ రాదికముల
బొంకముగ నేను నెన్ని న ♦ లంకరింతు;
బదిభవనమునుండి తప్పుకో ♦ బలము లేదు.