పుట:Geetanjali (Telugu).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

93

గీతాంజలి.

మందిరద్వారమున జెవి ♦ విందు సేయ.

95


కడగి యాజీవితములోని ♦ గడవనెప్పు
డేను దాటితినో నాకు ♦ నెఱక లేదు;
అడవి నడురేయి మొగ్గవో ♦ లహహ నన్ను
వింతలో వింత యగు మహా ♦ విశ్వమందు
నేమహాక్తి గొలిపెనో ♦ యెఱుగరాదు.
వేకువను గాంతి నాకన్ను ♦ సోకగానె
నేను లోకమ్ములో గ్రొత్త ♦ గా నటంచు
బేరు రూపును లేక య ♦ భేధ్యుడైన
ప్రభువు నాతల్లిరూ పొంది ♦ పరమకరుణ
జెతులను దాల్చె నని తొచె ♦ జిత్తమందు.
ఇట్లు తెలియంగ గాని యీ ♦ యీశ్వరుండె
చిరపరిచితుండువోలె నా ♦ మరణమందు
గూడ గనబడు గనబదు ♦ గూర్మితోడ;
నిప్పు డీజీవితమ్ము నే ♦ నెలమి జూతు
గాన మృతిగూడ బ్రేమతో ♦ గాంతు నపుడు;
తల్లికుడిఱొమ్మునం దుండి ♦ తన్ను దీయ
నుత్తరక్షణమందున ♦ జిత్త మలర
నెడమఱొమ్మున శాంతిని ♦ బడయుకొఱకె