పుట:Geetanjali (Telugu).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

మరణమా ! చెవి గునగున ♦ మాట జెప్ప
రమ్ము; తడవేల మరణమా! ♦ రమ్ము రమ్ము!
అర్ధి నీకయి వేచితి ♦ ననుదునమ్ము;
నీకొఱకై యుంటి సుఖదు:ఖ ♦ నిచయ మోర్చి;
నాయనియు నేను నాయాశ ♦ నాదు ప్రేమ
మన్నియును నిన్నుగూర్చి గో ♦ ప్యముగ బాఱె;
నొక్కసరి దుది నన్ జూడు ♦ మోమరణమ!
నీవశంబయి పోవునా ♦ జీవనమ్ము.
లీల గూర్పంగంబడినట్టి ♦ పూలదండ
సిద్ధ మయ్యెను; వరునికై ♦ సిద్ధ మయ్యె.
పెండ్లి కాగానె వధువు సం ♦ ప్రీతి రాత్రి
నేకతమ్ముగ నెవ్వరి ♦ దృష్టి బడక
నిలయమును వీడి ప్రభువుతో ♦ గలిసికొనును.

92


సాయు నిబ్భూమి నాదృష్టి ♦ పధమునుండి
యొక్కనాడని తెలియదు ♦ జక్కగాను.
ప్రాణ మాజ్ఞను గైకొని ♦ మౌనముగను
పొవు దుది తెర నాకండ్ల ♦ ముందు బఱపి;
కాని చుక్కలు రాత్రుల ♦ గాచు విడక
వేకువయు నెప్పటట్టులు ♦ వేగుచుండు