పుట:Geetanjali (Telugu).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
84

గీతాంజలి.

శబ్దముల యక్షగానంబు ♦ సలుపుచుండ
నదియును వియోగచింతయే ♦ యరసిచూడ
మాటిమాటికి మనుజుల ♦ మందిరముల
భేదమోదానురాగవాం ♦ చాదు లగుచు
మత్కవిత్వహృదంతర ♦ మార్గమునను
బాటగ గరంగి సతతము ♦ బాఱుచుండు
నదియును వియోగచింతయే ♦ యరసిచూడ.

85


నాధుభవనమునుండి యా ♦ యోధవరులు
గదగి యని కయి తొలుదొల్త ♦ వెడలినపుడు
తమబలము నెల్ల నెచ్చట ♦ దాచి చనిరి?
శస్త్రకవచంబు లెచ్చట ♦ జాఱి పడియె?
ప్రభునివాసంభునం దుండి ♦ వచ్చునపుడు
వారలుండిరి యనదల ♦ పగిదిజూడ
శరపరంపర వారిపై ♦ గురిసి యుండె.
స్వామిభవనము మరి చేర ♦ జనెడునపుడు
తమబలములెల్ల నెచ్చట ♦ దాచి చనిరి ?
ఖడ్గశరచాపములు వారి ♦ కడను లేవు
నుదుటిపై శాంతరసము సొం ♦ పొదవి యుండె
మరల విభుమందిరము జేర ♦ దరలునపుడు