పుట:Geetanjali (Telugu).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
2

గీతాంజలి.

82


నాధ ! నీచేత గాల మ ♦ నంత మగును.
నీక్షణంబుల లెక్కింప ♦ నేర్చు నెవడు?
వడిగ రేయింబళ్లును ♦ గడచుచుండు.
విరులవలెను యుగంబులు ♦ విచ్చినాడు.
దేవ ! నేచుట యన నేమొ ♦ తెలియ నీకె.
ప్రధమదశ నుండునన్నిని ♦ వనసుమంబు
పూర్ణపరిణామమును బొంది ♦ పొదలుటకును
బైబయిని నెన్నియో శతా ♦ బ్దముల గడచు
వమ్ముగా బుచ్చ మాకు గా ♦ లమ్ము లేమి
వృధగ దరుణముబొనీక ♦పెనగవలయు
జాల మొనరింప మాకంత ♦ కాలున్నె?
వచ్చి మొఱలిడు ప్రతివాని ♦ కిచ్చుచుంట
గాల మంతయు వ్యర్ధమై ♦ కడచిపోవు.
కొనకి నాకాన్క నీపీఠ ♦ మునకు రాక
కాలమెంతయు వ్యర్ధమై ♦ కడచిపోవు
అంత నిలుపకనేను ది ♦ నాంతమందు
తలుపు మూయుడు రనుభీతి ♦ ద్వరగవత్తు
గాని యింకను గాలంబు ♦ గలిగి యుండు.