పుట:Geetanjali (Telugu).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

81

గీతాంజలి.

రాత్రి నీయాట జాలింప ♦ రాద ! నీవు
దలచితేనియు గాఢమౌ ♦ ధ్వాంతముననౌ
అమలప్రాభాతవిస్మిత ♦ మందు నేని
స్వచ్చతర మై వెలింగెడు ♦ శైత్యముననొ
కలసిపోవును గనులకు ♦ గాన రాక

81


ఎన్నియోమార్లు తోచక ♦ యున్నవేళ
వమ్ముగాబుచ్చి నట్టికా ♦ లమ్ము గూర్చి
యుల్లమున వే గరమ్ము జిం ♦ తిల్లివాడు;
గాని నాకాల మూరక ♦ కడవ లేదు.
దేవ! నాజీవితమున బ్ర ♦ తిక్షణమును
స్వయముగా నీకరమ్ముల ♦ బట్టినావు.
అన్నిటను గల్గి లోలోన ♦ నలరు చుండి
పూన్కితో విత్తనమ్ముల ♦ మొలకలుగను!
మొగ్గలను సాంపుగుల్కెడు ♦ పువ్వులుగను
బూల ఫలములుగా జేసి ♦ ప్రోతు వీవు.
బడలి తొచక పాన్పుపై ♦ బండి యుండి
యాగె జనులెల్ల ననుకొంటి ♦ హాయి గంటి
లేచి వేకువ దోటను ♦ జూచుసరికి
వింతవింతల విరులచే ♦ వెలసి యుండె.