పుట:Geetanjali (Telugu).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

75

గీతాంజలి.

నీప్రసాదంబు లెల్ల న ♦ నింద్యచరిత !
తనకు గలనిత్యకర్తవ్య ♦ మును నొనొర్ప
బల్లెలం బొలముల జొచ్చి ♦ పఱచి కూడ
నెడతగక పాఱు నీ ♦ కడకె మరలు
గడకు నీపాదకమలముల్ ♦ గడుగుకొఱకు.
విరివిరిచి చక్కగా దన ♦ పరిమళమును
గాలిలోపల గమ్మగా ♦ గ్రమ్మికూడ
గొనకు దను నీకు నర్పించు ♦ కొనుటె తనకు
నంత్యకర్తవ్యముగ నెంచు ♦ నమలచరిత !
పొందునె కొఱంత జగము నీ ♦ పూజవలన?
కవులు పలుకుచునుండువా ♦ క్యముల కవని
నెవ్వ రేయర్ధ మొనరించి ♦ రేనిగూడ
వానిఫలితార్ద మెల్ల నీ ♦ వైపె చూపు.

76


నాడునాటికి నాప్రాణ ♦ నాధ ! నేను
నీముఖాముఖి నిలువగా ♦ నేర్తు గాక !
చేతులను గట్టుకొప్ని జగ ♦ జ్జ్యోతి వైన
నీకు నేను ముఖాముఖి ♦ నిలుతు గాక !
కడువిశాలంపునీదు నా ♦ కసముక్రింద
నేకతంబుగ మౌనంబు ♦ నే ధరించి