పుట:Geetanjali (Telugu).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

73

గీతాంజలి.

మోదములను మఱెన్నియో ♦ భేదములను
నతము నామది గొల్పెడు ♦ స్వామి యతడె.

 

73


ముక్తి నే గోర నెపుడు వి ♦ రక్తి యందు
బ్రమద మొసగెడు నేనవేల్ ♦ బంధనముల
మోక్షపరిరంభణసుఖంబె ♦ పొడము మదికి.
వివిధవర్ణసుగంధముల్ ♦ వెలసి యున్న
క్రొత్తద్రాక్షారసమ్మును ♦ గూర్మితోడ
వంచి తిన్నగ నాదుమృ ♦ త్పాత్రయందు
నిరతమును బోయుచుందువు ♦ నిండునట్లు.
తావకజ్వాలచేత వం ♦ దలకొలంది
వివిధదీపాల వెలిగించి ♦ వింత గదుర
దేవ ! నీయాలయంబున ♦ దివ్యపీఠి
ముందు బెట్టును నాజగ ♦ మందముగను.
మూయ నాయింద్రియద్వార ♦ ములను మూయ
గన్ను జెవియును స్పర్శంబు ♦ గాంచుసుఖము
నీసుఖంబును వహియించు ♦ నిక్కువముగ.
నాదుమాయావినోద మా ♦ నందతేజ
మగుచు వెల్గును నాయాశ ♦ లన్నిగూడ
బక్వమగుప్రేమఫలము లై ♦ పరిణమించు.