పుట:Geetanjali (Telugu).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59

గీతాంజలి.

ముత్తెముల దీయువారలు ♦ ముత్తెములకు
మునుగుచుందురు మున్నీట ♦ ముదముతోడ;
నరుగుదురు నావ లెక్కి బే ♦ హార్లుగాని
పొందుగా గుల్కరాళ్లను ♦ బ్రోగుసేసి
చల్లుచుందురు మాటికి ♦ బిల్ల లెలమి;
దాగుసిరులను వెదుకంగ ♦ దలప రెపుడు;
వలలు వైచుట యెట్టిదో ♦ తెలియకుంద్రు.
వార్ధి పకపక నవ్విన ♦ నగిది పొంగు.
తీరసుస్మేరమొప్పును ♦ దెల్లగాను.
అంత మొదవించుశక్తితో ♦ నలరు నలలు
పిల్ల నిది తొట్ల నూపెడు ♦ తల్లివోలె
బాడు నర్ధములేపట్టి ♦ పాట లెపుడు
హాయిగా బాలు రెంతయు ♦ నాలకింప.
తోయనిధి యాదు బిల్లల ♦ తోడ గూడి;
తీరసుస్మేర మొప్పును ♦ దెల్లగాను.
సారమే లెని సంసార ♦ వార్ధితటిని
వేడ్కతో గూది యుందురు ♦ పిల్ల లెల్ల;
విపధమై పోల్చుచుండెడు ♦ నింటియందు
గడగి సంచార మొనరించు ♦ గాలివాన;
దుష్పధంబై న వార్దిని ♦ దూలి తూలి
విఱుగుచుండును నావలు ♦ విఱుగుచుండు;