పుట:Geetanjali (Telugu).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

గీతాంజలి.

మిత్తికడపటిదెబ్బచే ♦ హత్తి నట్టి
బాధ దుది దత్తరిల్లెడు ♦ ప్రాణమట్లు
సంచలించుచు నుండునీ ♦ వించుకత్తి
చండకాంతిని మఱసి యు ♦ ద్దండమోహ
మంతయును భస్మ మొనరించు ♦ సతులశుభ్ర
తేజమును బ్రోలి క్రాలునీ ♦ తేజువాలు.
ఉడుమణులచేత ఖచితమై ♦ యెప్పనీదు
కంకణము సుందరం బయి ♦ కడు జెలంగు;
గాని చూడంగ దలపంగ ♦ గానియట్టి
యతులసౌందర్యమహిమచే ♦ నలరుగాదె.
నరలునీచేత తరవారి ♦ వజ్రధాది!

54


అడుగ లే దేమియును నిన్ను ♦ నడుగ లేదు.
చెవిని బడ నీకు నాపేరు ♦ జెప్ప లేదు.
నీ వరుగుచుండ నూరక ♦ నిలిచి యుంటి;
గ్రాలు చుండెడువృక్షంపు ♦ వాలునీడ
నొంటిగా నుంటి నే నూతి ♦ యొడ్డునందు
నీరు నల్లనికడవల ♦ నిండ నింపి
కొంచు బోయిరి యిండ్లకు ♦ మించుబోండ్లు
అమ్మ ప్రొద్దెక్కె బోదము ♦ ర మ్మటంచు