పుట:Geetanjali (Telugu).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

గీతాంజలి.

నీకె కల్గును బో యింక ♦ నిక్కముగను.
మకుటముగ నిత్తు బ్రాణంబు; ♦ మరణమునకు
నతనిసాయంబు నీవు నా ♦ కంపియుంట.
బంధనమ్ముల నెల్లను ♦ బట్టి నఱుక
భవదతులఖడ్గ మున్నది ♦ భయము లేదు.
సేయ నిక దుచ్చమైనకై ♦ సేత లెవియు
వేచి మూలల వలవించు ♦ విధముగాని
వలపు సిగ్గులు గాని నా ♦ వలన నింక
గలుగజాలవు ప్రాణేశ ♦ కలుగలేవు
యోగ్యభూషణముగ ఖడ్గ ♦ మొసగినావు
బ్నొమ్మసొమ్ముల నెనింక ♦ బూన బూన

53


పలు తెఱంగులరంగుల ♦ బదిఢవిల్లు
రత్నములచేత నక్షత్ర ♦ రాజ చేత
ఖచిత మైనట్టినీదుకం ♦ కణము చూడ
నెంతయు మనోహరంబయి ♦ యెసగు; గాని
సంజకొపమ్మువోలు కెం ♦జాయలోన
జక్కవిచ్చిన గరుడుని ♦ ఱెక్కలట్లు
కాంతివంపుననెల్గు నీ ♦ కత్తి చూడ
నంతకంటెన్ నందమై ♦ యలరుదేవ !