పుట:Geetanjali (Telugu).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

గీతాంజలి.

దివ్యసుమములొ? పరిమళ ♦ ద్రవ్యతతులొ?
కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదు కాదు.
జ్వాలవలె నెల్గి పిడుగువొల్ ♦ బరువుగల్గి
వరలుబలమైననీకర ♦ వాలు దేవ!
బాలరవికిరణాళి ప్ర ♦ బాతవేళ
వచ్చినీసెజ్జ బర్వుగ ♦ వాక్షమునను.
వనిత! నీవేమి గంటివే ♦ యనుచు నన్ను
వేకువను బక్షి గూయుచు ♦ వేడ్క నడుగు.
దివ్యసుమములొ? పరిమళ ♦ ద్రవ్యతతులొ?
కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదుకాదు.
నీకరము పట్టు ఖడ్గంబు ♦ భీకరంబు.
ఎట్టివర మిది నాకు బ్ర్రా ♦ ణేశయంచు
వింతతో గూరుచుండి యో ♦ చింతు నెపుడు.
ఎచట దాపంగవలయునో ♦ యెఱుగ రాదు.
అబల నేగాన దాల్పంగ ♦ నగును సిగ్గు.
అక్కునను జేర్ప గాదు గా ♦ యంబు పడును.
అయిన నీవు ప్రసారించి ♦ నట్టిదీని
దు:ఖకరమైన భరమైన ♦ దొఱగకుందు.
హృదయసీమనె ధరియించి ♦ యెనగుచుందు.
ఇది మొదలు లేదు భయము నా ♦ కీజగాన
నాదుపోకాలముల నెల్ల ♦ నాధ ! జయము