పుట:Geetanjali (Telugu).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

గీతాంజలి.

తెఱవబడుగాక తలుపులు; ♦ దివ్యరవము
పొడమ శంఖాళి యొత్తంగ ♦ బడునుగాక !
అంధకారమాంబు భ ♦ యంకరంబు
నైనమనయింటి కరుదెంచె ♦ నధిపు డిపుడు
నట్టనడు రేయిల్ మనయెడ ♦ నెట్టిదయొ;
మేఘముల్ గడునుఱిమెను ♦ మింట గ్రమ్మి;
తమము మెఱపులచేతను ♦ దత్తరిల్లె;
దెమ్ము నీచింపిచాప నీ ♦ దేవునకును;
ముందు ముంగిట బఱువుము ♦ పొందికగను;
గాలరాత్రికి నాధుడై ♦ గ్రాలుఱేడు
చండవర్షంబులో జెప్ప ♦ కుండ వచ్చె.

52


నీదుగొజ్జంగిపూదండ ♦ నేను గోర
దలచితిని గాని ధైర్యంబు ♦ గలుగ దయ్యె.
స్వామి! వేకువ వీడునీ ♦ పాన్పుమీద
రాలినవి గొన వేచితి ♦ జాల దమిని.
అర్ధిమైనడి వేడ్కతో ♦నరయు చుంటి
రేపకడ నొక రెండుపూ ♦ ఱేకులకును
అహహ ! నేనేమి గనుగొంటి ♦ నరసి యరసి
నాకు నీవిడ్డప్రేమచి ♦ హ్నం బదెద్ది ?