పుట:Geetanjali (Telugu).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

గీతాంజలి.

నగపడియె మిన్కులీనుచు ♦ నద్భుతముగ;
బరమపూరుష ! యొక చిన్న ♦ పైడిగింజ,
అంత నాదెల్ల నీకిచ్చు ♦ నట్టిబుద్ది
కటకటా ! నాడు నాకేల ♦ కలుగదయ్యె
నంచు విలపించితిని జాల ♦ నాత్మలోన.

51


రాత్రి యరుదెంచె నెల్లడ ♦ గ్రమ్మె దమము;
పనులు ముగిసెను రాత్రి రా ♦ వలయునారు;
వచ్చి రందఱు గడపటి ♦ వాడు వచ్చె;
నూరితలుపుల మూసిరి ♦ యుచితరీతి;
బ్రభువు రానున్నవా డని ♦ పలికె నొకడు.
అందులకు నవ్వి యిట్లు కా ♦ దంటి మేము.
తలుపు దట్టినయట్లు శ ♦ బ్ధంబు గలిగె.
గాలి యని చెప్పి యచటిదీ ♦ పాల నార్పి
కూర్కుకై పండి యుండగా ♦ గొంతవడికి
నదిగొ! వినబడె దూతనప ♦ ల్కనియె నొకడు.
అందులకు నవ్వి యది వాయు ♦ వంటి మేము.
నట్టనడు రేయి నొకమహా ♦ నాద మొద్వె;
గలవరించుచునిద్రలో ♦ పలబరుంట
దూరమున గల్గునఱుముగా ♦ దోచె మాకు;