పుట:Geetanjali (Telugu).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

గీతాంజలి.

కానబడె దూరమున నీదు ♦ కనకరధము.
అహహ ! ఱేఱే డెవండని ♦ యబ్రపడితి
నితిశయింపగ జొచ్చెనా ♦ యాశ లెల్ల;
వదలె నాదుర్దినము లని ♦ మదికి దొచె;
సిరులు వెదజల్లబడును బో ♦ క్షితి నటంచు
బిచ్చమునకయి దూరాన ♦ వేచియుంటి;
వడిగ రధము నాకడ ♦ వచ్చి నిలిచె,
దృష్టి నామీద బఱపుచు ♦ దేరు డిగ్గి
నవ్వుచును వచ్చితివి నీవు ♦ నన్ను జేర;
భాగ్యము ఫలించె ననుకొంటి ♦ బ్రభువతంస ?
యింతలో జూపి కుడిచెయ్యి ♦ యేమి నాకు
నియ్యగల వని యడిగితి ♦ నేమి చెపుదు?
బిచ్చగానికి జేజూపి ♦ బిచ్చ మడుగు
నిట్టి నెప్రభుపరిహాస ♦ మెన్న దరమె?
చిత్తము చలించె నేనేమి ♦ చెప్ప నగునొ
నాకే తెలియక యుండెను ♦ నాధ ! యపుడు.
నన్నధాన్యంపుగింజ నా ♦ సంచినుండి
తీసి యిచితి నీకు నో ♦ దేవదేవ!
కాని యామాపు సంచిలో ♦ గ్రాలుచుండు
ధాన్యమును గుప్పవోసిన ♦ దానిలోన