పుట:Geetanjali (Telugu).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

గీతాంజలి.

నాకుటీరమునాకిట ♦ నాధ ! నీవు
వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!
చేరి యొకమూల గానంబు ♦ సేయుచుంటి;
నొంటిగా నేను బరులకు ♦ గంటబడక
యీమధురగీతి చెవిసొక ♦ నెలమితోడ
నాకుటీరమువాకిట ♦ నాధ ! నీవు
వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!
గానమున జాణలెందఱో ♦ గలదు; నీదు
భవనమున బాట లెప్పుడు ♦బాడుచుంద్రు.
అఱిగి యెఱుగక పాడిన ♦ సరళగీతి
యెట్లు నీప్రీతిపాత్రమై ♦ యెసగె దేవ?
చేతమున జాలినిడుచున్న ♦ గీత మొకటి
జగతిలోనిమహాగాన ♦ సమితి గలయ,
సుమము నొక్కటి పారితో ♦ షముగ గొంచు
నాకుటీరములోనికి ♦ నాధ ! నీవు
వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చు బ్రేమ!

50


ఇంట నింటను బిచ్చంబు ♦ నెత్తుటకును
గ్రామమున బోవుచుండ మా ♦ ర్గంబు వట్టి
పరమవైభవదీప్తసు ♦ స్వప్న మట్లు