పుట:Geetanjali (Telugu).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

గీతాంజలి.

ధీరవరులార! మాన్యులు ♦ మీరెసుండు.
వెక్కిరింతలు చీవాట్లు ♦ పెక్కుమార్లు
లేపయత్నింప లక్ష్యంబు ♦ లేకయుంటి.
హర్షగర్భితగాఢదై ♦ న్యంబునందు
మందమోదాంకురచ్చాయ ♦ నెంచుచుంటి.
కొనల రవికాంతి ప్రసరించు ♦ క్రొత్తతమము
లొనివిశ్రాంతి నాహృద ♦ యాన బర్వె;
యాత్రవిషయంబె మఱచితి ♦ నాత్మలోన;
నీడజోలినమాయలో ♦ నెగడుచుండు
వింతలకు గానములకు నా ♦ స్వాంత మెల్ల
బెట్టివైచితి నూరక ♦ పెనగకుండ.
కట్టకడపట మేల్కాంచి ♦ కనులు దెఱవ
నీవు నను జేరి యిట్లు నా ♦ నిద్ర నెల్ల
స్మేరపూరంబుచే ముంచు ♦ చెలువు గంటి.
దీర్ఘమును దుర్గంబు నీ ♦ దివ్యపధము;
నిన్ను బొందంగ సాధ్యమై ♦ యున్నెయంచు
నెంత వెఱచి నేనుబ్రా ♦ ణేశ మదిని!

49


నీదుసింహాస్నము డిగ్గి ♦ నెమ్మితొడ