పుట:Geetanjali (Telugu).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

ఎవ్వ డొకసారి యైనను ♦ నవ్వలేదు;
నేల జూచుచు నెక్కడ ♦ నిలువలేదు.
వేళ గడచినకొలదిని ♦ వేగ మెచ్చ
నడుచుచుంటిమి మార్గంభు ♦ గడచుచుండె;
గగనమణి నింగినడుమను ♦ గ్రాలజొచ్చె;
బావురమ్ములు నీడలో ♦ పలను మూల్గె.
మట్టమధ్యాహ్నమందలి ♦ మండుగాలి
నెడుటాకులు సండిగొని ♦ నృత్యమాడె.
మఱ్ఱిక్రీనీడ గొల్లడు ♦ గుఱ్ఱవెట్టి
కలవరించుచు నిద్రించె ♦ గాళ్లు చాపి;
నీటియొడ్డున గొర్చుండి ♦ నేనుగూడ
బడలియుండినయంగనముల్ ♦ పచ్చగడ్ది
మీద జాపితి గొంచెము ♦ సేదదీర;
దుచ్చముగ జూచి నవ్విరి ♦ తోడివారు;
తరలిపోయిరి యెత్తిన ♦ తలలతోడ;
దిరిగి చూదక నిలువక ♦ తెన్నువట్టి
కొనకు దూరాన నీలంపు ♦ మసకలోన
గలసిపొయిరి కనులకు ♦ గానరాక;
ఎన్నియె బయళ్ల, గుట్టల ♦ నెక్కిదాటి
చనుచుండిరి దూరదే ♦ శముల గడచి.
అంతమొఱుగనిమార్గమ్ము ♦ నంది చన్న