పుట:Geetanjali (Telugu).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
42

గీతాంజలి.

నతనిచిఱునవ్వుకాంతిచే ♦ నట్టె నిచ్చు
మన్నిమీలితనేత్రాల ♦ కున్నెసాటి?
కాంతు లన్నిటిలో దొలి ♦ కాంతివలెను
రూపులన్నింటిలో దొలి ♦ రూపునవలెను
నతడు దృష్టికిగోచర ♦ మగునుగాత!
తెలివి నొందిననాయాత్మ ♦ తొలిసుకంబు
నతనికడకంటిచూపుచే ♦ నందుగాత !
కాంచి నను నేను నాతని ♦ గాంతుగాత!

48


శాంతముగనున్నప్రాభాత ♦ సమయవార్ధి
చారురుతములచేత సం ♦ చలన మొందే.
త్రోవకడ బాలు వికసించి ♦ తొంగలించె;
స్వర్ణసంపద మేఘాల ♦ సందులందు
సిరుల జల్లుచు విరివిగా ♦ జెదరి యుండె.
దేని లక్ష్యంబుసేయక ♦ ధీరులట్లు
తొరతొరగ బొవుచుంటిమి ♦ త్రోవబట్టి
పాటలు విలాపముగ మేము ♦ పాడలేదు;
ఆటలనుగూడ నెవ్వియు ♦ నాడలేదు;
బేరములకయి గ్రామముల్ ♦ చేరలేదు;
నోటిలోనుండి యొకటైన ♦ మాట లేదు;