పుట:Geetanjali (Telugu).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

47

అతనికై వేచి యుంటి ని ♦ రర్ధకముగ;
రాత్రి కొనముట్టవచ్చెను ♦ రాడు రాడు;
బడలి నిద్రించినపుడు నా ♦ బసకు నతడు
వచ్చునొ హటాత్తుగాను బ్ర ♦ భాతవేళ
నంచు నాచిత్త మందు భ ♦ యంబు వొడమె.
దారి తెఱవుడు; తెఱువుడు ♦ తలుపు లెల్ల;
నతని నాటంకపఱువకు ♦ డాప్తులార!
అతనికాల్సడి నను లేవ ♦ దయ్యెనేని
లేవ యత్నింపకుడు మీరు ♦ లేపకుండు.
కలకలంకుసేయుపక్షుల ♦ వలన గాని
సుప్రభాతోత్సవంబున ♦ జూఱలాడు
గాలిచే గాని మేల్కొన ♦ గాదు నాకు.
నాధు డొకవేళ నున్నదు ♦ న్నట్లు వచ్చి
యాలయము జేరెనేనియు ♦ హాయిగాను
నిద్ర పోనిండు; పోనిండు ♦ నిద్ర నన్ను.
అతడు ముట్టిన జాలు నే ♦ నంతరింతు
ననెడువెలలెనినిద్ర నా ♦ హాయినిద్ర!
నిదుర చీకటిలోనుండి ♦ పొదలి వచ్చు
స్వప్నగతి నిల్వ నతడు నా ♦ సమ్ముఖమున