పుట:Geetanjali (Telugu).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

గీతాంజలి.

చింత జిక్కినచిత్తమున్ ♦ జేరి యొ
తద్దియను శాంతి నిడునవి ♦ తత్సదములె.
పైడిజిగివంటి సంతొష ♦ భావమునకు
దశతఓళల గూర్చునవి కూడ ♦ దత్సదములె.

46


ఎంతకాలంబునుండి న ♦ న్నెలమి జేర
నెడ తెగక వచ్చుచున్నావొ ♦ యెఱుగ నేను;
రవికి జుక్కులకెనిని ♦ రంతరంబు
నిన్ను నానుండి దాపగా ♦ నెన్నదేని
శక్తి గలుగంగజాలునే ♦ స్వామి! చెపుమ.
చూపు ఱేపును నెన్నియో ♦ మార్లు నాకు
వినబడియె నీదుకాల్సడి ♦ నినగబడియె;
వచ్చి నీదూత నామది ♦ జొచ్చి నన్ను
గోప్యముగ బిల్చి పోయెను ♦ గూర్మితోడ.
ఏమొకోకాని నేడు నా ♦ కెపుడు లేని
యతిశయం బైనయుత్సాహ ♦ మంకురించె;
మించి హర్షంబు మదిని గ ♦ లంచి పాఱె;
బని ముగించెడుతఱి వచ్చె ♦ ననగ దోచె.
నన్నిధిని దెల్పుపరిమళ ♦ సారలవము
ఘ్రాణపర్వముగా సోకె ♦ గాలి గలసి.