పుట:Geetanjali (Telugu).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

పొంగుదును దీనికయి యంత ♦ రంగమందె
గడ్డిపై గూరుచుండి యా ♦ కసము జూచి
నీవు దేవ ! తటాలున ♦ నింగినుండి
భవ్యతరముగ దెగెడువై ♦ భవము గూర్చి
కలవరించుచు నుంటి ని ♦ క్కరణి నేను.
ఒక్కమారు తళుక్కని ♦ లెక్కలేని
దీపకొటులు వెల్గె దే ♦ దీప్యముగను.
నీరధన్వర్ణ కేతన ♦ నిచయ మెల్ల
నిగనిగల నీని పటపట ♦ నింగి నాడె.
దేవ! నను దుమ్ములోనుండి ♦ లేవ నెత్తి
వేసనిని గాలి దూలుతీ ♦ వియనితాన
గర్వలజ్ఞాభరంబుల ♦ గడువడంకు
చింపిగుడ్డల నిబ్బీద ♦ చిన్నదాని
బ్రీతి నీప్రక్క గూర్చుండ ♦ బెట్టుకొనగ
నీవు పీఠంబు డిగ్గి వేం ♦ చేయజూడ
నిరుగడల దారిపొడుగున ♦ నెల్లజనులు
నివ్వెఱను నోరు దెఱచుచు ♦నిల్వ బడిరి.
కాని యెంతయొకాలంబు ♦ గడచి పోయె;
వింతవఱకును వేచిన ♦ యీ చెవులకు
నీరధరధాంగనినదంబు ♦ చేరి రాదు.
కనుల మిఱుమిట్లు ♦ గొలిపెడి ♦ కాంతితొడి