పుట:Geetanjali (Telugu).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

గీతాంజలి.

వారివెన్కను గన్నుల ♦ బడకయుండ
దుమ్ం గ్రమ్మునత్రోవలో ♦ ద్రోసికొనుచు
జనుచున్నారు దాటినిన్ ♦ సరకు గొనక;
పూజసామగ్రి ముందట ♦ బొందుపఱచి
వేచి బడలితి నెంతయో ♦ వేళనుండి;
వచ్చిపొయెడువారు పు ♦ ష్పములయందు
నొక్కొటొక్కటె కొనిపోవు ♦ చుండి రిదితో!
బుట్ట నట్టిది గానవచ్చె ♦ బూలు ముగిసి;
కడచె బూర్వాపరాహ్ణముల్; ♦ పొడమె నంజ
నిద్ర కనులకు రా జొచ్చె ♦ నీడ నుంట;
గృహములకు నేగువార లీ ♦ క్షించి నన్ను
జేరి నవ్వుచు ముంచిరి ♦ సిగ్గులోన.
బిచ్చ మెత్తెడుకన్నియ ♦ విధం దోప
గొంగు మోమున గూరిచి ♦ కూరుచుంటి;
"నేమిగొరెదజ్?" నని నన్ను ♦ నెవ రడిగిన
గన్నులన్ వాల్చి క్రిందికి ♦ మిన్న కుంటె;
నీకొఱకు వేచి యున్నాను ♦ నే నటంచు
వచ్చుటకు మాట నీవు నా ♦ కిచ్చి తంచు
జేరి యడిగినవారితో ♦ జెప్ప నగునె?
తుచ్చ మగుదీని గాన్కగా ♦ దెచ్చితి నని
యెట్లు తెల్పుదు నాకు సి ♦ గ్గేని గాదె?