పుట:Geetanjali (Telugu).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
22

గీతాంజలి.

శాంతమును రోయుచందన ♦ ర్షంబులబోలె
దేవ! నీప్రేమ కే నెంత ♦ దిరుగ బడిన
"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నె"
యనెడు మాటలె నాలోన ♦ నలరుచుండు.

39


చిత్త మిది గట్టిసారి శు ♦ ష్కించినపుడు
వరదయావృష్ఠితో గూడి ♦ తరలి రమ్ము.
జీవకళ జీవితములోన ♦ జెడినయపుడు
విమలగానామృతం బొల్క ♦ వెడలి రమ్ము.
బాహ్యశబ్ధంబు చెవిలోన ♦ బడకయుండ
నెల్లకడలను దుములంబు ♦ లెచ్చినపుడు
శాంతివిశ్రాంతులను గూడి ♦సౌమ్యమూర్తి !
వడివడిగ నాదుమదిపయి ♦ వ్రాల రమ్ము.
తుచ్చహృదయమ్ము దైన్యంబు ♦ తోడ నొక్క
మూల దలవంచి కూర్చుండు ♦ కాలమందు
దేవదేవేంద్ర ! తలుపులు ♦ దెఱచివైచి
రమ్ము రాజ్యూభిషిక్తస ♦ మ్రాట్టుభంగి,
మాయతో నాన మదికన్ను ♦ మూయునపుడు
నిర్మలాతులభూరిని ♦ ర్నిద్రతేజ!
మెఱుము లుఱుములతో రమ్ము ♦ మేఘమట్లు.